xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
పార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా సచిన్ అర్చిత్ రహార్ బాధ్యతల స్వీకరణచినమేరంగిలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’శ్రీసిటీ టీఐఎల్ కంపెనీ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందితీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేయాలిఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలినదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషిపార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా సచిన్ అర్చిత్ రహార్ బాధ్యతల స్వీకరణచినమేరంగిలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’శ్రీసిటీ టీఐఎల్ కంపెనీ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందితీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేయాలిఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలినదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి
ఆంధ్రప్రదేశ్

దసరా ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

03-10-2026 16:47
దసరా ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
దసరా మహోత్సవాలకు వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, వారి భద్రత, సౌకర్యాలు, సులభ దర్శనానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు, విజయవాడ నగరపాలక సంస్థ (వీఎంసీ) కమిషనర్ ధ్యానచంద్ర, దేవస్థానం ఈవో వీకే శీనా నాయక్ తెలిపారు.
xPress24, Vijayawada, October 3, దసరా మహోత్సవాలకు వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, వారి భద్రత, సౌకర్యాలు, సులభ దర్శనానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు, విజయవాడ నగరపాలక సంస్థ (వీఎంసీ) కమిషనర్ ధ్యానచంద్ర, దేవస్థానం ఈవో వీకే శీనా నాయక్ తెలిపారు. ఈ నెల 11వ తేదీ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి 20వ తేదీ ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు జరగనున్న దసరా మహోత్సవాల ఏర్పాట్లను పరిశీలించేందుకు శనివారం కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, దేవస్థానం ఈవో శీనా నాయక్ వివిధ శాఖల అధికారులతో కలిసి సంయుక్త తనిఖీలు నిర్వహించారు. సీతమ్మవారి పాదాలు, కేశఖండనశాల, హోల్డింగ్ ఏరియాలు, వినాయక టెంపుల్, రథం సెంటర్, టోల్‌గేట్, ఘాట్‌రోడ్డు తదితర ప్రాంతాలను సందర్శించి ఏర్పాట్లను విస్తృతంగా పరిశీలించారు. భక్తుల భద్రత, సౌకర్యాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. అనంతరం కొండపై నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. దసరా ఉత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వినూత్న కార్యాచరణ రూపొందించినట్లు కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. భక్తుల రాకపోకలు, దర్శనం, క్యూలైన్లు, పార్కింగ్, తాగునీటి సరఫరా, వైద్య సేవలు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై సమగ్ర ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు ఏఐ ఆధారిత డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నిరంతరం 24 గంటల పాటు సేవలందించేలా కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఘాట్ల వద్ద జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈసారి పున్నమి ఘాట్‌లో జాతీయ సరస్ మేళా నిర్వహించనున్న నేపథ్యంలో, గౌరవ రాష్ట్రపతి కూడా హాజరుకానున్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లలో 2024 నుంచి సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యతనిస్తూ వినూత్న ప్రణాళికలతో చర్యలు చేపడుతున్నామని పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు తెలిపారు. ఈసారి మరింత పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. బూమ్ బ్యారియర్లు, యాక్సెస్ కంట్రోలర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి మార్గదర్శకాల మేరకు సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మొత్తం 22 పార్కింగ్ పాయింట్లను ఏర్పాటు చేశామని, 3,500 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహించనున్నట్లు తెలిపారు. యువ, ఉత్సాహవంతులైన పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు విశ్లేషించేందుకు క్రౌడ్ అనలిటిక్స్ విధానానికి ప్రాధాన్యతనిస్తూ, పరిస్థితులకు అనుగుణంగా నిరంతరం పర్యవేక్షణ చేపడతామని వివరించారు. దసరా ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, మరుగుదొడ్ల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాలను సమగ్రంగా కల్పిస్తున్నామని వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా పారిశుద్ధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచి, పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. స్వచ్ఛ దసరా స్ఫూర్తితో ముందుకు సాగుతున్నామని తెలిపారు. దసరా ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్న ప్రత్యేక పూజలు, ప్రత్యేక దర్శనాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని దేవస్థానం ఈవో వీకే శీనా నాయక్ తెలిపారు. ఆలయంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ప్రత్యేక అలంకరణలు చేపడుతున్నామని, పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.