ఆంధ్రప్రదేశ్
దసరా ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు
07-10-2026 10:14

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై విజయవాడలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ నెల 14న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమ్మవారిని దర్శించుకోనున్నారని 15న సరస్ మేళాను ప్రారంభించనున్నారని తెలిపారు. సామాన్య భక్తులే ప్రాధాన్యతగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు.
xPress24, vijayawada, October 7,