ఆంధ్రప్రదేశ్
దేవాలయాల, గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం
29-09-2026 16:59

పట్టణ, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఆరిపల్లి శ్రీ శేషాచల స్వామి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే రూ.3.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, మరో రూ.10 కోట్లతో కోటిలేని, ఇతర ప్రాంతాల్లోని పలు దేవాలయాల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.

పలు పనులు చేపట్టనున్నట్లు, రూ.50 లక్షల్లో వీధి రహదారి పనులను త్వరితగతిన ప్రారంభించనున్నట్లు తెలిపారు. నూజివీడు రహదారికి రూ.95 లక్షలు, యాదవుల బజారు నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లే రహదారికి రూ.1.50 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత ప్రజలకు మరింత మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, దేవాలయాలు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.