xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
రెండో రోజుకు చేరిన భద్రకాళి శరన్నవరాత్రి ఉత్సవాలు: అన్నపూర్ణాదేవిగా అమ్మవారి దర్శనంరాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు: ఏనుగు నరసింహారెడ్డిఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ఛార్జీల తగ్గింపుపై ప్రభుత్వం పునఃపరిశీలనసిద్దిపేట అభివృద్ధి కేసీఆర్ ఘనతే: మాజీ మంత్రి హరీశ్‌రావుసిరిసిల్లలో అండర్‌-17 బాలికల రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభంజేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల సమస్యలు పరిష్కరించాలి: కేటీఆర్రెండో రోజుకు చేరిన భద్రకాళి శరన్నవరాత్రి ఉత్సవాలు: అన్నపూర్ణాదేవిగా అమ్మవారి దర్శనంరాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు: ఏనుగు నరసింహారెడ్డిఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ఛార్జీల తగ్గింపుపై ప్రభుత్వం పునఃపరిశీలనసిద్దిపేట అభివృద్ధి కేసీఆర్ ఘనతే: మాజీ మంత్రి హరీశ్‌రావుసిరిసిల్లలో అండర్‌-17 బాలికల రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభంజేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల సమస్యలు పరిష్కరించాలి: కేటీఆర్
తెలంగాణ

నిజామాబాద్ లో కళ్యాణ లక్ష్మీ షాది, ముభారక్ చెక్కుల పంపిణీ

12-10-2026 10:35
నిజామాబాద్ లో కళ్యాణ లక్ష్మీ షాది, ముభారక్ చెక్కుల పంపిణీ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి మూడు సంవత్సరాలు అవుతున్న ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడం లేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు.
xPress24, Nizamabad, October 12, నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం లో కళ్యాణ లక్ష్మీ,షాది ముభారక్ చెక్కుల పంపిణీ జరిగింది.ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ,అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ చేతుల మీదుగా చెక్కులను అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తులం బంగారం ఇవ్వాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఆదివారం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. మొత్తం 275 మంది లబ్ధిదారులకు 2.75 కోట్ల విలువైన చెక్కులను అందజేశారు.కల్యాణలక్ష్మి షాది ముభారక్ అనే పథకం తిరుమల తిరుపతి దేవస్థానం వారు నాడు దళితులకు గిరిజనులకు ఉచిత వివాహాలు జరుపుతూ దేవస్థానం కమిటీ తరపున వధూ వరులకు నూతన వస్త్రాలు,తాళి బొట్టు,మెట్టెలు ఉచితంగా అందించారని గుర్తు చేశారు.ఇదే సమయం లో వక్ఫ్ బోర్డ్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పినపుడు అందరికీ వర్తింప జేయాలని అమల్లోకి తేవడం జరిగిందన్నారు.బంగారం ధర పెరగడం వల్ల ఇచ్చిన హామీ కాస్త ఆలస్యం అయ్యిందని ప్రత్యామ్నాయంగా లక్ష నూటపదహారుకు బదులు మరింత నగదును పెంచే ప్రయత్నం చేస్తామని చెప్పారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మీ పథకంపై ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయని, పథకం నిలిపివేస్తారనే పుకార్లు వస్తున్నాయన్నారు. దీనిపై అధికారులు, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు స్పష్టత ఇవ్వాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు కావస్తుందని, కనీసం హామీ ఇచ్చిన సమయంలో ఉన్న ధరకే బంగారం ఇవ్వాలన్నారు. అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు నమోదు చేసుకున్న లబ్ధిదారులకు తొందరగా చెక్కులను అందజేయాలని సూచించారు.ఈ  కార్యక్రమంలో  నూడా చైర్మన్ కేశ వేణు, బీజేపీ కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, మఠం పవన్, జగదీష్ కులకర్ణి, న్యాలం సునీత రాజు, బంటు ప్రీతి ప్రవీణ్, ఇప్పకాయల సుమిత్ర కిషోర్, నాయకులు పంచరెడ్డి శ్యామ్, పవన్ ముందడ తదితరులు పాల్గొన్నారు.

🎥 వీడియో

నిజామాబాద్ లో కళ్యాణ లక్ష్మీ షాది, ముభారక్ చెక్కుల పంపిణీ

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.