xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
వినుకొండలో మెగా జాబ్ మేళాఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్ సమీక్షడోలీ రహదారి పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలిఆసియా క్రీడల విజేతలకు సీఎం చంద్రబాబు అభినందనలుల్యాండ్‌ పూలింగ్‌ ప్రక్రియపై మంత్రి నారాయణ సమీక్షజేఎన్‌టీయూజీవీ–శ్రీయాన్‌ సంస్థ మధ్య కీలక ఎంవోయూవినుకొండలో మెగా జాబ్ మేళాఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్ సమీక్షడోలీ రహదారి పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలిఆసియా క్రీడల విజేతలకు సీఎం చంద్రబాబు అభినందనలుల్యాండ్‌ పూలింగ్‌ ప్రక్రియపై మంత్రి నారాయణ సమీక్షజేఎన్‌టీయూజీవీ–శ్రీయాన్‌ సంస్థ మధ్య కీలక ఎంవోయూ
ఆంధ్రప్రదేశ్

నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

07-10-2026 13:57
నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు.
xPress24, Amaravati, October 7, అమరావతి, అక్టోబరు 07: ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీ సహా  కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, జలవనరుల శాఖామంత్రి సీఆర్ పాటిల్, ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తదితరులతో సీఎం భేటీ కానున్నారు. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుతో పాటు బీచ్ కారిడార్ ప్రాజెక్టులను మంజూరు చేయాలని ప్రధాని మోదీకి సీఎం విజ్ఞప్తి చేయనున్నారు. ప్రత్యేకించి నదుల అనుసంధానం ప్రాజెక్టు చేపట్టేందుకు అవసరమైన అధ్యయనం చేయించాలని కూడా కోరనున్నారు. అలాగే ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితుల నుంచి ఉపశమనం కలిగించేలా ప్రత్యేక నిధులు మంజూరుపై కూడా ప్రధాని, కేంద్ర హోమంత్రి అమిత్ షానూ కోరనున్నారు. వచ్చే ఏడాదిలో గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం కేంద్ర సహకారం అందించాలని ప్రధాని, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే అంశంపై  కూడా కేంద్ర ఆర్ధిక మంత్రితో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. గోదావరి నది నుంచి పెద్ద ఎత్తున సముద్రంలోకి వెళ్తున్న వరద నీటిని సద్వినియోగం చేసుకునే అంశంతో పాటు నదుల అనుసంధానంపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో భేటీలో చర్చించనున్నారు. రేపు 12 గంటలకు ఢిల్లీలో భారత పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించే సీఐఐ భాగస్వామ్య సదస్సు కర్టైన్ రైజర్ సదస్సులో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయెల్‌తో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. అనంతరం రేపు రాత్రికి ఢిల్లీ నుంచి అమరావతికి చేరుకోనున్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.