xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ప్రపంచ రేబిస్ దినోత్సవం నిర్వహణప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యంమహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యంకొత్తగా 16.32 లక్షల రేషన్ కార్డుల మంజూరుసీఈసీ రాజీనామా డిమాండ్‌తో కాంగ్రెస్‌ నిరసన ర్యాలీపొంగులేటి నివాసం, కార్యాలయాల ఈడీ సోదాల వివరాలు వెల్లడించాలని బీఆర్‌ఎస్ డిమాండ్ప్రపంచ రేబిస్ దినోత్సవం నిర్వహణప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యంమహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యంకొత్తగా 16.32 లక్షల రేషన్ కార్డుల మంజూరుసీఈసీ రాజీనామా డిమాండ్‌తో కాంగ్రెస్‌ నిరసన ర్యాలీపొంగులేటి నివాసం, కార్యాలయాల ఈడీ సోదాల వివరాలు వెల్లడించాలని బీఆర్‌ఎస్ డిమాండ్
ఆంధ్రప్రదేశ్

నంద్యాల జిల్లా యువతకు ప్రధానమంత్రి ప్రశంస

28-09-2026 14:39
నంద్యాల జిల్లా యువతకు ప్రధానమంత్రి  ప్రశంస
నంద్యాల జిల్లాలో పురాతన ఆలయాలు, కోనేరులు, బావులను పునరుద్ధరిస్తున్న యువత సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. నిన్న ప్రసారమైన మన్‌కీ బాత్ కార్యక్రమంలో రాష్ట్రానికి చెందిన యువత పాడుబడిన పురాతన బావిని పునరుద్ధరించిన విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు.జిల్లాలోని కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాల గ్రామంలోని 600 ఏళ్ల నాటి బావిని యువత పునరుద్ధరించింది. కాంత్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి ‘పూర్వ సంపద రక్షకసేన’ను ఏర్పాటు చేసి పురాతన కట్టడాల పరిరక్షణకు కృషి చేస్తున్నారు. గ్రామస్థుల సహకారంతో విరాళాలు సేకరించి ఇప్పటివరకు ఆళ్లగడ్డ, బనగానపల్లి, అవుకు, కొలిమిగుండ్ల మండలాల్లో పలు బావులు, కోనేరులు, ఆలయాలను పునరుద్ధరించారు.
xPress24, Nandyal, September 28, నంద్యాల జిల్లాలో పురాతన ఆలయాలు, కోనేరులు, బావులను పునరుద్ధరిస్తున్న యువత సేవలను ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ ప్రశంసించారు. నిన్న  ప్రసారమైన మన్‌కీ బాత్ కార్యక్రమంలో రాష్ట్రానికి  చెందిన యువత పాడుబడిన పురాతన బావిని పునరుద్ధరించిన విషయాన్ని ప్రధానమంత్రి  ప్రస్తావించారు.జిల్లాలోని కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాల గ్రామంలోని 600 ఏళ్ల నాటి బావిని యువత పునరుద్ధరించింది. కాంత్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి ‘పూర్వ సంపద రక్షకసేన’ను ఏర్పాటు చేసి పురాతన కట్టడాల పరిరక్షణకు కృషి చేస్తున్నారు. గ్రామస్థుల సహకారంతో విరాళాలు సేకరించి ఇప్పటివరకు ఆళ్లగడ్డ, బనగానపల్లి, అవుకు, కొలిమిగుండ్ల మండలాల్లో పలు బావులు, కోనేరులు, ఆలయాలను పునరుద్ధరించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.