ఆంధ్రప్రదేశ్
నంద్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణ
15-10-2026 16:43
నంద్యాల జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికలను ఎన్నికల నిబంధనల ప్రకారం సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు.
xPress24, Nandyal, October 15,
నంద్యాల జిల్లా, అక్టోబర్ 15:
నంద్యాల జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికలను ఎన్నికల నిబంధనల ప్రకారం సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో అర్బన్ లోకల్ బాడీస్ పరిధిలోని ఎన్నికల అధికారులు, అదనపు ఎన్నికల అధికారులకు నిర్వహించిన ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు తమకు కేటాయించిన బాధ్యతలు, ఎన్నికల ప్రక్రియలోని వివిధ దశలు, సంబంధిత నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని స్పష్టం చేశారు.
అధికారుల మధ్య సమన్వయం, రికార్డుల నిర్వహణ, విధుల కేటాయింపు, పారదర్శకత, నిష్పక్షపాత వైఖరికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఎన్నికల విధుల నిర్వహణలో ఎదురయ్యే సందేహాలను శిక్షణ సమయంలోనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాలను సకాలంలో అమలు చేస్తూ, ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా సమష్టిగా కృషి చేయాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, ట్రైనీ కలెక్టర్ ప్రియాంక, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా నోడల్ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆరు మున్సిపాలిటీల కమిషనర్లు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.