ఆంధ్రప్రదేశ్
నదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి
03-10-2026 16:50

నదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. విజయవాడలో నిన్న నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛత అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని.. ఐదు కోట్ల మంది ప్రజలు భాగస్వాములై ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగితేనే రాష్ట్రంలో శాశ్వత మార్పు సాధ్యమవుతుందని అన్నారు. జల్‌జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ కుళాయి నీరు అందించడంతో పాటు మురుగునీటి శుద్ధికి రాష్ట్రవ్యాప్తంగా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
xPress24, Vijayawada, October 3,