xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ సందర్భంగా సిరిసిల్లలో సేవా సంకల్ప్ అభియాన్ఆసిఫాబాద్‌లో జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు ప్రారంభంబాపూఘాట్‌లో గాంధీ జయంతి వేడుకలుఉద్యోగులు, పెన్షనర్లకు రెండు విడతల డీఏ మంజూరుకు కేబినెట్ ఆమోదంకరీంనగర్‌లో గాంధీ జయంతి సందర్భంగా బండి సంజయ్ నివాళులుగాంధీ ఆశయాలతో స్వచ్ఛ భారత్‌ను విజయవంతం చేస్తున్న మోదీ: రామచందర్‌రావుమోదీ 25 ఏళ్ల ప్రజాసేవ సందర్భంగా సిరిసిల్లలో సేవా సంకల్ప్ అభియాన్ఆసిఫాబాద్‌లో జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు ప్రారంభంబాపూఘాట్‌లో గాంధీ జయంతి వేడుకలుఉద్యోగులు, పెన్షనర్లకు రెండు విడతల డీఏ మంజూరుకు కేబినెట్ ఆమోదంకరీంనగర్‌లో గాంధీ జయంతి సందర్భంగా బండి సంజయ్ నివాళులుగాంధీ ఆశయాలతో స్వచ్ఛ భారత్‌ను విజయవంతం చేస్తున్న మోదీ: రామచందర్‌రావు
తెలంగాణ

నిరుద్యోగ యువతను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసింది: బీజేపీ ఎంపీ డీకే అరుణ

02-10-2026 14:29
నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ సన్నాహక సమావేశంలో ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ ఊసేలేదని, ఉద్యోగాల కోసం ఆందోళనలు చేస్తున్న యువతను అరెస్టు చేస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పాలనలతో విసిగిపోయిన ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని పేర్కొన్నారు.
xPress24, Mahabubnager, October 2, ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ అమలుపై కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందని విమర్శించారు.. జాబ్ క్యాలెండర్ ఏది?. రాష్ట్రంలో లక్షలాది మంది పట్టభద్రులు, నిరుద్యోగ యువత నోటిఫికేషన్ల కోసం ఆశగా ఎదురుచూస్తుంటే ప్రభుత్వం వారి గోడును ఏమాత్రం పట్టించుకోవడం లేదని డీకే అరుణ విమర్శించారు. అధికారంలోకి రాగానే క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించి, ఇప్పటివరకు దాన్ని అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. తమ న్యాయమైన హక్కుల కోసం, ఉపాధి కోసం శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న యువతను అక్రమంగా అరెస్టు చేస్తూ ప్రజా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీలో బీజేపీ విజయం ఖాయం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నియంతృత్వ పాలన చూశామని, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుమించి అణచివేత ధోరణిని అవలంబిస్తోందని డీకే అరుణ ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ నాణేనికి ఉన్న రెండు ముఖాల్లాంటివేనని, ప్రజలకు ఇప్పటికే ఈ రెండు పార్టీల తీరుపై పూర్తి అవగాహన వచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని విద్యావంతులు, యువత బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని, రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బైట్: డీకే అరుణ, మహబూబ్‌నగర్ ఎంపీ (బీజేపీ)

🎥 వీడియో

నిరుద్యోగ యువతను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసింది: బీజేపీ ఎంపీ డీకే అరుణ

నిరుద్యోగ యువతను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసింది: బీజేపీ ఎంపీ డీకే అరుణ

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.