xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
బుచ్చి అప్పారావు జీవితం ఆదర్శనీయం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ఉత్సవాల వైభవాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపేదల వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక భరోసాకోటబొమ్మాళి అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర మంత్రుల శ్రీకారంసౌర విద్యుత్‌తో పర్యావరణ పరిరక్షణకు భరోసాదివ్యాంగులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం: జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్బుచ్చి అప్పారావు జీవితం ఆదర్శనీయం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ఉత్సవాల వైభవాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపేదల వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక భరోసాకోటబొమ్మాళి అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర మంత్రుల శ్రీకారంసౌర విద్యుత్‌తో పర్యావరణ పరిరక్షణకు భరోసాదివ్యాంగులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం: జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్
ఆంధ్రప్రదేశ్

నిరుపేద కుటుంబాల అభ్యున్నతికి ‘సమావేశి ఆజీవిక యోజన’

13-10-2026 14:01
నిరుపేద కుటుంబాల అభ్యున్నతికి ‘సమావేశి ఆజీవిక యోజన’
రాష్ట్రంలోని అత్యంత నిరుపేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుని, వారికి స్థిరమైన జీవనోపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘సమావేశి ఆజీవిక యోజన’ కార్యక్రమాన్ని ప్రారంభించిందని పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
xPress24, Amaravati, October 13, అమరావతి, అక్టోబర్ 13: రాష్ట్రంలోని అత్యంత నిరుపేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుని, వారికి స్థిరమైన జీవనోపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘సమావేశి ఆజీవిక యోజన’ కార్యక్రమాన్ని ప్రారంభించిందని పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. దీనదయాళ్ అంత్యోదయ యోజన–జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ (DAY-NRLM) కింద అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 10 వేల అత్యంత నిరుపేద కుటుంబాలను పేదరికం నుంచి బయటపడేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. యానాది, చెంచు తెగల జనాభా అధికంగా ఉన్న 26 మండలాల్లోని 650 గ్రామ సంఘాల పరిధిలో అర్హులైన కుటుంబాలను గుర్తించి, ఈ పథకం ద్వారా వారికి ఆర్థికంగా చేయూతనందించనున్నట్లు మంత్రి తెలిపారు. నిరుపేద కుటుంబాలకు జీవనోపాధి అవకాశాలు కల్పించి, వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.