తెలంగాణ
నిర్మల్ జిల్లాలో రూ.23.35 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
05-10-2026 15:46

నిర్మల్ జిల్లాలో 23.35 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా గోదావరి పుష్కరాల రహదారులు, రిజిస్ట్రార్, తహసీల్దార్ కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, ప్రభుత్వ సేవలు అందించేందుకు ఈ పనులను గడువులోగా పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు.
xPress24, HYDERABAD, October 5,