xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
బతుకమ్మ రద్దీకి సికింద్రాబాద్‌–కాగజ్‌నగర్‌ ప్రత్యేక రైలుఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు ఉచిత వైద్య పరీక్షలురాజన్న సిరిసిల్లలో జిల్లా స్థాయి పోషణ మేళా నిర్వహణప్రత్యేక అవసరాల పిల్లలకు గౌరవం, అవకాశాలు కల్పించాలి: గవర్నర్బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: మంత్రి సీతక్కజీఎస్టీ సంస్కరణలతో రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను కాపాడాలి: భట్టి విక్రమార్కబతుకమ్మ రద్దీకి సికింద్రాబాద్‌–కాగజ్‌నగర్‌ ప్రత్యేక రైలుఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు ఉచిత వైద్య పరీక్షలురాజన్న సిరిసిల్లలో జిల్లా స్థాయి పోషణ మేళా నిర్వహణప్రత్యేక అవసరాల పిల్లలకు గౌరవం, అవకాశాలు కల్పించాలి: గవర్నర్బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: మంత్రి సీతక్కజీఎస్టీ సంస్కరణలతో రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను కాపాడాలి: భట్టి విక్రమార్క
ఆంధ్రప్రదేశ్

నరసింగోలులో ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

09-10-2026 14:33
కొండపి నియోజకవర్గంలోని నరసింగోలులో శుక్రవారం నిర్వహించిన ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
xPress24, Ongole, October 9, ప్రకాశం జిల్లా, అక్టోబర్ 9: కొండపి నియోజకవర్గంలోని నరసింగోలులో శుక్రవారం నిర్వహించిన ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముప్పాళ్ల వద్ద రూ.27.85 కోట్ల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణంతో పాటు, పోతుల చెంచయ్య పాలేరు రిజర్వాయర్‌ స్పిల్‌వే, ప్రధాన తూముల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ప్రకాశం జిల్లాలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న గర్భకండ్రిక భూ సమస్యలను పరిష్కరించి, అర్హులైన రైతులకు హక్కు పత్రాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా భూ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్‌తో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

🎥 వీడియో

నరసింగోలులో ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.