xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
రాష్ట్రంలో మెరుగైన విద్యుత్ అందిస్తాం - భట్టిదిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ‘ఇండి’ కూటమి నిరసనఈసీ కార్యాలయం ముట్టడి యత్నం హాస్యాస్పదం: రామచందర్ రావుభారత్‌ వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంక్‌యుద్ధ నౌకల కోసం భారీ రక్షణ ఒప్పందంగ్రామీణ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలురాష్ట్రంలో మెరుగైన విద్యుత్ అందిస్తాం - భట్టిదిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ‘ఇండి’ కూటమి నిరసనఈసీ కార్యాలయం ముట్టడి యత్నం హాస్యాస్పదం: రామచందర్ రావుభారత్‌ వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంక్‌యుద్ధ నౌకల కోసం భారీ రక్షణ ఒప్పందంగ్రామీణ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలు
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా వసతుల కల్పనకు ప్రాధాన్యం

06-10-2026 14:26
నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా వసతుల కల్పనకు ప్రాధాన్యం
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించడంతో పాటు క్రీడా వసతుల కల్పనకు కూడా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.
xPress24, Nellore, October 6, నెల్లూరు: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించడంతో పాటు క్రీడా వసతుల కల్పనకు కూడా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని వి.ఆర్. నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల మైదానంలో ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్ షెల్టర్, మరుగుదొడ్ల నిర్మాణానికి మంత్రి నారాయణ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్థలం అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని 18 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. వి.ఆర్. నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలను రాష్ట్రంలోని ఇతర పాఠశాలలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ పాఠశాలకు స్వచ్ఛ అవార్డు లభించడం సంతోషకరమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్యం, క్రీడా ప్రతిభను పెంపొందించేందుకు అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.