xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
చేనేత, హస్తకళల ప్రోత్సాహానికి క్రాఫ్ట్స్ కౌన్సిల్ కృషి అభినందనీయంబీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందిఅమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో నేటి నుంచి జంగిల్ సఫారీ పునఃప్రారంభంసిరిసిల్ల సభలో బీఆర్‌ఎస్ నేతల ఆస్తులపై శ్వేతపత్రానికి సీఎం డిమాండ్రేవంత్‌ వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలుసిరిసిల్ల సభలో కాంగ్రెస్ నేతల ప్రభుత్వ పథకాలపై ప్రసంగాలుచేనేత, హస్తకళల ప్రోత్సాహానికి క్రాఫ్ట్స్ కౌన్సిల్ కృషి అభినందనీయంబీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందిఅమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో నేటి నుంచి జంగిల్ సఫారీ పునఃప్రారంభంసిరిసిల్ల సభలో బీఆర్‌ఎస్ నేతల ఆస్తులపై శ్వేతపత్రానికి సీఎం డిమాండ్రేవంత్‌ వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలుసిరిసిల్ల సభలో కాంగ్రెస్ నేతల ప్రభుత్వ పథకాలపై ప్రసంగాలు
ఆంధ్రప్రదేశ్

నషా ముక్త్ భారత్‌పై అవగాహన హెల్త్ వాక్

01-10-2026 10:12
యువత ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని అనంతపురం జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) ఉపకులపతి సుదర్శన రావు సూచించారు.
xPress24, Anantapur, September 30, అనంతపురం: యువత ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని అనంతపురం జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) ఉపకులపతి సుదర్శన రావు సూచించారు. నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా నిర్వహించనున్న అవగాహన హెల్త్ వాక్‌కు సంబంధించిన గోడపత్రికలను బుధవారం జేఎన్టీయూ ప్రాంగణంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ.. ‘నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్–రాష్ట్రీయ సంకల్ప్ సమారోహ్’ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 1న హెల్త్ వాక్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. యువతలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించడం, వారిని వ్యసనాలకు దూరంగా ఉండేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడంతో పాటు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు. అక్టోబర్ 1న ఉదయం 6 గంటలకు అనంతపురం జేఎన్టీయూ మెయిన్ బిల్డింగ్ సమీపం నుంచి 3 కిలోమీటర్ల హెల్త్ వాక్ ప్రారంభమై ఓ.టి.పి.ఆర్.ఐ వరకు కొనసాగుతుందని తెలిపారు.

🎥 వీడియో

నషా ముక్త్ భారత్‌పై అవగాహన హెల్త్ వాక్

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.