తెలంగాణ
నస్పూర్ గేటు వద్ద లారీ-ఆటో ఢీ, ఇద్దరు మృతి
28-09-2026 16:39

మంచిర్యాల జిల్లా నస్పూర్ గేటు వద్ద లారీ, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులను మందమర్రి మండలం గుడిపెల్లి పొన్నారం గ్రామానికి చెందిన అత్తలి సౌందర్య, చింతకుంట లక్ష్మిగా గుర్తించారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు మంచిర్యాల రూరల్ సీఐ రవీందర్ తెలిపారు. క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
xPress24, HYDERABAD, September 28,