జాతీయం
పీఎంఏవై–అర్బన్ 2.0లో ఆంధ్రప్రదేశ్ కి ప్రథమ స్థానం
06-10-2026 09:41

ప్రధానమంత్రి ఆవాస్ యోజన – అర్బన్ 2.0 పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించింది. ప్రపంచ ఆవాస దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోఖాన్ సాహు ఈ అవార్డును రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి హెప్సిబా రాణికి అందజేశారు. ఈ అంశంపై గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పందిస్తూ ఇళ్ల నిర్మాణంలో వేగం, పారదర్శకత, లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ, నిరంతర పర్యవేక్షణ వంటి చర్యలతో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు.2029 నాటికి అర్హులైన పేదలందరికీ సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.
xPress24, New Delhi, October 6,