xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
చేనేత, హస్తకళల ప్రోత్సాహానికి క్రాఫ్ట్స్ కౌన్సిల్ కృషి అభినందనీయంబీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందిఅమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో నేటి నుంచి జంగిల్ సఫారీ పునఃప్రారంభంసిరిసిల్ల సభలో బీఆర్‌ఎస్ నేతల ఆస్తులపై శ్వేతపత్రానికి సీఎం డిమాండ్రేవంత్‌ వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలుసిరిసిల్ల సభలో కాంగ్రెస్ నేతల ప్రభుత్వ పథకాలపై ప్రసంగాలుచేనేత, హస్తకళల ప్రోత్సాహానికి క్రాఫ్ట్స్ కౌన్సిల్ కృషి అభినందనీయంబీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందిఅమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో నేటి నుంచి జంగిల్ సఫారీ పునఃప్రారంభంసిరిసిల్ల సభలో బీఆర్‌ఎస్ నేతల ఆస్తులపై శ్వేతపత్రానికి సీఎం డిమాండ్రేవంత్‌ వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలుసిరిసిల్ల సభలో కాంగ్రెస్ నేతల ప్రభుత్వ పథకాలపై ప్రసంగాలు
ఆంధ్రప్రదేశ్

పింఛన్‌ భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

01-10-2026 16:35
పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్‌ భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు.
xPress24, Vizianagaram, October 1, గజపతినగరం: పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్‌ భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. గురువారం విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలోని గజపతినగరం తానా వీధిలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్‌ నెల పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.2,692.34 కోట్లను విడుదల చేసిందన్నారు. ఈ నెలలో మొత్తం 61.80 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. పంపిణీ నిధుల్లో రూ.2,675.63 కోట్లను సంబంధిత స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు పింఛన్‌ బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘ఎస్‌ఎన్‌ఏ స్పర్ష్‌’ (SNA SPARSH) విధానం ద్వారా పింఛన్‌ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే డీబీటీ విధానాన్ని పైలట్‌ ప్రాతిపదికన గజపతినగరంలో ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఈ విధానం కింద గజపతినగరం మండలంలోని ఎన్‌ఎస్‌ఏపీ పింఛనుదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.6 లక్షలు జమ కానున్నాయని చెప్పారు.

🎥 వీడియో

పింఛన్‌ భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.