తెలంగాణ
పంటల ఎండిపోతున్నా సీఎం పట్టించుకోవడం లేదు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
12-10-2026 15:45

రాష్ట్రంలో పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోకుండా ఢిల్లీ పర్యటనలు చేయడం దారుణమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. ఇవాళ నాంపల్లి బీజేపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాంచందర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో సాగుతోందని, కేంద్రం తెలంగాణకు రూ.లక్షల కోట్లు కేటాయించిందని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేసేవరకు రాహుల్ గాంధీని రాష్ట్రంలో అడ్డుకుంటామని, రైతుల తరఫున పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.
xPress24, HYDERABAD, October 12,