ఆంధ్రప్రదేశ్
పైడితల్లి అమ్మవారి సిరిమాను పందిరిరాట ఉత్సవం
01-10-2026 14:09
మేళతాళాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ విజయనగరం ప్రజల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి గురువారం అంకురార్పణ జరిగింది.
xPress24, Vizianagaram, October 1,
విజయనగరం:
మేళతాళాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ విజయనగరం ప్రజల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి గురువారం అంకురార్పణ జరిగింది. సిరిమానోత్సవంలో తొలి ఘట్టంగా సంప్రదాయబద్ధంగా పందిరిరాట కార్యక్రమాన్ని నిర్వహించారు.
విజయనగరంలోని మూడులాంతర్ల వద్ద ఉన్న చదురుగుడి ఆవరణలో గురువారం ఉదయం 9.30 గంటలకు పందిరిరాట ప్రక్రియను నిర్వహించారు. ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఆలయ అర్చకులు బంటుపల్లి వెంకటరావు, ట్రస్టు బోర్డు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిరిమానోత్సవ తొలి ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు.