xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
చేనేత, హస్తకళల ప్రోత్సాహానికి క్రాఫ్ట్స్ కౌన్సిల్ కృషి అభినందనీయంబీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందిఅమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో నేటి నుంచి జంగిల్ సఫారీ పునఃప్రారంభంసిరిసిల్ల సభలో బీఆర్‌ఎస్ నేతల ఆస్తులపై శ్వేతపత్రానికి సీఎం డిమాండ్రేవంత్‌ వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలుసిరిసిల్ల సభలో కాంగ్రెస్ నేతల ప్రభుత్వ పథకాలపై ప్రసంగాలుచేనేత, హస్తకళల ప్రోత్సాహానికి క్రాఫ్ట్స్ కౌన్సిల్ కృషి అభినందనీయంబీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందిఅమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో నేటి నుంచి జంగిల్ సఫారీ పునఃప్రారంభంసిరిసిల్ల సభలో బీఆర్‌ఎస్ నేతల ఆస్తులపై శ్వేతపత్రానికి సీఎం డిమాండ్రేవంత్‌ వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలుసిరిసిల్ల సభలో కాంగ్రెస్ నేతల ప్రభుత్వ పథకాలపై ప్రసంగాలు
ఆంధ్రప్రదేశ్

పేదరిక నిర్మూలనే ప్రజా సేవలో 2.0 లక్ష్యం

01-10-2026 16:41
గ్రామాల్లో పేదరికాన్ని నిర్మూలించడమే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
xPress24, Srikakulam, October 1, కోటబొమ్మాళి: గ్రామాల్లో పేదరికాన్ని నిర్మూలించడమే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం దుప్పలపాడు గ్రామంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా సేవలో 2.0’ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోటబొమ్మాళి మండలం గంగువాడలో రూ.47 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన ఐదు అంతర్గత సిమెంట్ రోడ్లను మంత్రి ప్రారంభించారు. దుప్పలపాడులో రూ.38.80 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న రక్షిత మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు. అదే గ్రామంలో రూ.16 లక్షలతో నిర్మించిన అంతర్గత సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కేవలం సంక్షేమ పథకాలు, పింఛన్లు అందించడమే కాకుండా ప్రతి ఒక్కరికీ సుస్థిరమైన జీవనోపాధి కల్పించడం ద్వారా కడు పేదరికాన్ని నిర్మూలించడంతో పాటు ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడమే ‘ప్రజా సేవలో 2.0’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వంతో పాటు గ్రామాల్లో ఆర్థికంగా స్థిరపడిన వారు, వివిధ రంగాల్లో అభివృద్ధి చెందిన వ్యక్తులు కూడా ప్రజా సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఆర్థికంగా బలంగా ఉన్న వారు ‘మార్గదర్శులు’గా ముందుకు వచ్చి కడు పేదరికంలో ఉన్న కుటుంబాలను ‘బంగారు కుటుంబాలు’గా దత్తత తీసుకుని వారికి అండగా నిలవాలని కోరారు.

🎥 వీడియో

పేదరిక నిర్మూలనే ప్రజా సేవలో 2.0 లక్ష్యం

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.