ఆంధ్రప్రదేశ్
పేదలకు వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
05-10-2026 13:11
రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్యానికి దూరం కాకూడనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తోందని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
xPress24, Rajamahendravaram, October 5,
రాజమహేంద్రవరం:
రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్యానికి దూరం కాకూడనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తోందని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
నిడదవోలు పట్టణంలోని కాపు కళ్యాణ మండపంలో నియోజకవర్గానికి చెందిన 205 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.1,02,82,199 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు, ఎల్‌ఓసీ పత్రాలను మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 198 మంది లబ్ధిదారులకు రూ.76,73,564 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు, ఏడుగురు లబ్ధిదారులకు రూ.26,08,635 విలువైన ఎల్‌ఓసీ పత్రాలను అందజేసినట్లు తెలిపారు. నిడదవోలు నియోజకవర్గంలో ఇప్పటివరకు సీఎంఆర్‌ఎఫ్, ఎల్‌ఓసీ, ప్రత్యేక ఆర్థిక సాయం ద్వారా మొత్తం 1,382 మంది బాధితులకు రూ.9,07,58,066 మేర ఆర్థిక లబ్ధి చేకూర్చినట్లు వివరించారు.
చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేశామని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అవసరమైన ఆర్థిక సహాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.