xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రారంభంవిశాఖలో గ్రీన్‌ఫీల్డ్ టైర్ల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయండిఅల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజా పరిషత్‌ కార్యకలాపాలు ప్రారంభంప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దడమే లక్ష్యంజాతీయ రహదారి-167ఏ రెండో దశ విస్తరణ పనులకు భూమిపూజచిన్న కార్యక్రమంతో పిల్లల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనంజిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రారంభంవిశాఖలో గ్రీన్‌ఫీల్డ్ టైర్ల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయండిఅల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజా పరిషత్‌ కార్యకలాపాలు ప్రారంభంప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దడమే లక్ష్యంజాతీయ రహదారి-167ఏ రెండో దశ విస్తరణ పనులకు భూమిపూజచిన్న కార్యక్రమంతో పిల్లల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం
ఆంధ్రప్రదేశ్

ప్రకాశం బ్యారేజ్‌కు భారీ వరద

25-09-2026 14:47
తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా వరద ప్రవాహం చేరుతోంది. దీంతో అధికారులు బ్యారేజ్‌ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
xPress24, Vijayawada, September 25, విజయవాడ, సెప్టెంబర్ 25: తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా వరద ప్రవాహం చేరుతోంది. దీంతో అధికారులు బ్యారేజ్‌ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్‌ వద్ద 20 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి సుమారు 45 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజ్‌కు వస్తున్న వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నీటిని క్రమంగా దిగువకు వదులుతున్నారు. వరద నీటి విడుదల నేపథ్యంలో బ్యారేజ్‌ దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ సూచించారు. ముఖ్యంగా కృష్ణానదిలోకి, కాలువలు, వాగుల వద్దకు ప్రజలు వెళ్లవద్దని హెచ్చరించారు. బుడమేరుకు సంబంధించి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ తెలిపారు. బుడమేరు పరివాహక ప్రాంతంలోని పరిస్థితులను అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. నీటి ప్రవాహం, నీటిమట్టం తదితర పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రజలు సామాజిక మాధ్యమాలు, ఇతర మార్గాల్లో వచ్చే నిర్ధారణ లేని సమాచారాన్ని నమ్మవద్దని, అధికారికంగా అందించే సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ఇరిగేషన్‌తో పాటు సమన్వయ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండి పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారని తెలిపారు. పరిస్థితుల్లో ఏవైనా మార్పులు చోటుచేసుకుంటే ప్రజలకు వెంటనే సమాచారం అందించేలా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. గత వరదల అనంతరం గండ్ల పూడ్చివేత, కట్టల బలోపేతం, వెలగలేరు రెగ్యులేటర్‌ ఆధునీకరణ వంటి పలు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేవని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అధికారిక సమాచారం లేదా సహాయ సహకారాల కోసం కలెక్టరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని 9154970454 నంబర్‌లో సంప్రదించాలని కలెక్టర్‌ లక్ష్మీశ సూచించారు. తిరువూరు మండలం చింతలపాడు గ్రామంలో ఇటీవల కురిసిన అధిక వర్షాలు, వీచిన బలమైన గాలుల కారణంగా గృహాలు దెబ్బతిన్న బాధితులు ఎవరూ అధైర్యపడవద్దని కలెక్టర్‌ తెలిపారు. నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

🎥 వీడియో

ప్రకాశం బ్యారేజ్‌కు భారీ వరద

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.