ఆంధ్రప్రదేశ్
ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దడమే లక్ష్యం
25-09-2026 17:57
ప్రభుత్వ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా పరిశ్రమల కేంద్రం (DIC) ఆధ్వర్యంలో “ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త” లక్ష్యంతో నిర్వహించిన ఒకరోజు ‘MSME గ్రోత్ వర్క్‌షాప్’ ఉత్సాహంగా సాగింది.
xPress24, Bapatla, September 25,
బాపట్ల, సెప్టెంబర్ 25, 2026:
ప్రభుత్వ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా పరిశ్రమల కేంద్రం (DIC) ఆధ్వర్యంలో
“ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త”
లక్ష్యంతో నిర్వహించిన ఒకరోజు
‘MSME గ్రోత్ వర్క్‌షాప్’
ఉత్సాహంగా సాగింది. కార్యక్రమానికి బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ డా. వినోద్ కుమార్ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒకరిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSME) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, రుణాలు, ప్రోత్సాహకాలను స్థానిక యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
MSME రంగం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలతో పాటు స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన సాధించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలు, రాయితీలు, రుణ సదుపాయాలపై అవగాహన పెంచుకుని యువత పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టాలని సూచించారు.