తెలంగాణ
ప్రత్యేక అవసరాల పిల్లలకు గౌరవం, అవకాశాలు కల్పించాలి: గవర్నర్
09-10-2026 17:00

ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు గౌరవం, అవకాశాలు కల్పించాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్ రెడ్‌హిల్స్ లో నిర్వహించిన మాధవ్ ఆటిజం ఫౌండేషన్ 10వ వార్షికోత్సవంలో గవర్నర్ పాల్గొని మాట్లాడారు. ఆటిజం వ్యాధి కాదని, నాడీ వ్యవస్థ అభివృద్ధికి సంబంధించిన ప్రత్యేక పరిస్థితి అని చెప్పారు. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలపై అపోహలు తొలగించి, వారిపై జాలి చూపడం కంటే గౌరవం, అవకాశాలు కల్పించడమే ముఖ్యమని పేర్కొన్నారు. వారి అభివృద్ధికి సమాజం, అధికారులు, వైద్యులు సమష్టిగా కృషి చేసి సమ్మిళిత వాతావరణాన్ని, భరోసాను అందించాలని పిలుపునిచ్చారు.
xPress24, HYDERABAD, October 9,