ఆంధ్రప్రదేశ్
ప్రత్యేక రైళ్లు
23-09-2026 15:26

దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ లోని నరసాపురం నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నరసాపురం–చర్లపల్లి, నరసాపురం–తిరువణ్ణామలై మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనుందని చెప్పారు. ఇందులో భాగంగా 07062 నెంబర్ కలిగిన నరసాపురం–చర్లపల్లి ప్రత్యేక రైలు , 07291 నెంబర్ కలిగిన నరసాపురం–తిరువణ్ణామలై రైళ్లు అక్టోబర్ 4 నుంచి నవంబర్ 29 వరకు ప్రతి ఆదివారం నడుస్తాయని తెలిపారు.
xPress24, Amaravati, September 23,