జాతీయం
ప్రధానితో ముఖ్యమంత్రి భేటీ
09-10-2026 09:36

ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక పరిస్థితి, వ్యవసాయం, సాగునీరు, మౌలిక సదుపాయాల కల్పన వంటి పలు అంశాలపై ప్రధానమంత్రితో చర్చించారు.గోదావరి–కావేరి నదుల అనుసంధానం జరిగితే ఆంధ్రప్రదేశ్ తో పాటు, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు నీటి లభ్యత పెరుగుతుందని తెలిపారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, విశాఖ మెట్రో, వంటి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు.
xPress24, New Delhi, October 9,