విద్య
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులకు ప్రాధాన్యం
23-09-2026 05:30
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.
xPress24, Nellore, September 18,
నెల్లూరు జిల్లా, 18 సెప్టెంబర్ 2026 : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రి ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో 53 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక వనరుల కేంద్రం కార్యాలయ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం కల్పించడంతో పాటు, ఉపాధ్యాయులకు అవసరమైన సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు ఆత్మకూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలా అభివృద్ధి చేసి, మెరుగైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.