జాతీయం
పర్యావరణం పట్ల బాధ్యతగా ఉండాలి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
28-09-2026 10:28
పర్యావరణాన్ని రక్షించడం మన బాధ్యత అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ ద్వారా ప్రసంగించిన మోదీ పశ్చిమ బెంగాల్‌లో మడ అడవుల అభివృద్ధికి మహిళలు చేస్తున్న కృషిని కొనియాడారు.
xPress24, Delhi, September 27,
మనం పర్యావరణాన్ని రక్షిస్తున్నామంటే.. కేవలం చెట్లను, జీవరాశులను మాత్రమే రక్షించడం లేదనీ,.. మనం మొత్తం జీవ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాన్నిస్తున్నాయన్నారు. మన్ కీ బాత్ ద్వారా మాట్లాడిన మోదీ అస్సాంలో సోనాయీ రూపాయీ అను వన్యప్రాణుల అభయారణ్యంఉందనీ.. ఇంతకు ముందు ఇక్కడ ఏనుగుల నివాసం ఉండేదన్నారు. కానీ నెమ్మది నెమ్మదిగా అటవీ ప్రాంతంలో మనుషుల జోక్యం పెరుగుతుండటంతో ఏనుగులు ఈ ప్రాంతం నుండి దూరంగా వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్ళ క్రితం ఈ భూమిని ఆక్రమణ నుంచి విముక్తి చేశాక ఇప్పుడు అద్భుత పరిణామాలు కనిపిస్తున్నాయని.. ఏనుగులు ఇక్కడికి తిరిగి వచ్చాయని చెప్పారు. అలాగే అస్సాంలో చేపట్టిన పిగ్నీ హాగ్‌ల కోసం చేపట్టిన కన్వర్జేషన్ ప్రోగ్రామ్.. అవి పూర్తిగా కనుమరుగు కాకుండా కాపాడిందన్నారు. వాటికోసం గ్రాస్ ల్యాండ్స్‌ని ఏర్పాటు చేసినట్లు మోదీ తెలిపారు. ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనకు ఆసరాగా ఉంటుందని తెలిపారు. పశ్చిమ బెంగాల్ లోని సుందర్ బన్ లో కొందరు మహిళలు ఈ బంధానికి మంచి ఉదాహరణగా నిలుస్తున్నారన్నారు. ఝార్ఖాలీ కి చెందిన ఈ మహిళలు మడ అడవులను అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసించారు. వీటిని నాటడం వల్ల ఈ మహిళలకు ఆదాయం కూడా లభిస్తోందని ప్రధాని చెప్పారు. మనం ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ.. పర్యావరణాన్ని రక్షిస్తూ .. భవిష్యత్ తరాలకోసం బాధ్యతతో ఉండాలని ప్రధాని మోదీ సూచించారు.