xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
టిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా బొర్రా మెహర్జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున రొంగల అనూష నామినేషన్ దాఖలు చేశారు.ప్రతి నీటి చుక్కను పొదుపుగా వినియోగించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపుముగిసిన నామినేషన్ల గడువుతిరుమల బ్రహ్మోత్సవాలుజాతీయ స్థాయి సరస్ మేళాటిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా బొర్రా మెహర్జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున రొంగల అనూష నామినేషన్ దాఖలు చేశారు.ప్రతి నీటి చుక్కను పొదుపుగా వినియోగించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపుముగిసిన నామినేషన్ల గడువుతిరుమల బ్రహ్మోత్సవాలుజాతీయ స్థాయి సరస్ మేళా
తెలంగాణ

పర్యావరణం, సామాజిక సమస్యలపై షార్ట్ ఫిలింలు తీయాలి: భట్టి విక్రమార్క

19-10-2026 09:44
పర్యావరణం, సామాజిక సమస్యలపై షార్ట్ ఫిలింలు తీయాలి: భట్టి విక్రమార్క
బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్ ఛాలెంజ్ అవార్డ్స్–2026లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. వాతావరణ మార్పులు, నీటి సంరక్షణపై షార్ట్ ఫిలింల ద్వారా అవగాహన కల్పించాలని, యువ సినీ ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
xPress24, Hyderabad, October 17, బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్ ఛాలెంజ్ అవార్డ్స్–2026 ప్రదానోత్సవంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావాలు, తీవ్రమవుతున్న నీటి సంక్షోభంపై ప్రజల్లో విస్తృత చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలపై యువ దర్శకులు షార్ట్‌ఫిల్మ్‌ల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. సామాజిక అంశాలపై సృజనాత్మక చిత్రాలు ప్రకృతి వనరుల రక్షణలో భాగంగా నీటి సంరక్షణ, విద్యుత్ పొదుపు వంటి అంశాలపై యువ ఫిలిం మేకర్లు ప్రత్యేకంగా దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం సూచించారు. సమాజంలో ఉన్న పలు సామాజిక సమస్యలను ప్రతిబింబించేలా సృజనాత్మక చిత్రాలను రూపొందించాలని కోరారు. సమాజ హితం కోరే కంటెంట్‌తో ముందుకు వచ్చే యువ సినీ ప్రతిభను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సినీ రంగానికి కేంద్రంగా హైదరాబాద్ హైదరాబాద్ నగరాన్ని భారతీయ సినిమా రంగానికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భట్టి విక్రమార్క వెల్లడించారు. సాంకేతికత, వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ యువ దర్శకులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.