ఆంధ్రప్రదేశ్
పర్యావరణహితమైన ఖనిజాన్వేషణపై దృష్టి: మంత్రి కొల్లు రవీంద్ర
09-10-2026 14:35

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పర్యావరణహితమైన ఖనిజాన్వేషణ చేపట్టాలని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు.
xPress24, Amaravati, October 9,
అమరావతి, 09 అక్టోబర్ 2026 : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పర్యావరణహితమైన ఖనిజాన్వేషణ చేపట్టాలని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. అమరావతిలో జరిగిన ఖనిజ అన్వేషణ, పరిశోధన, ఆవిష్కరణల ట్రస్ట్ -MERIT పాలకమండలి రెండో సమావేశంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఖనిజ వనరులను డిజిటల్ విధానంలో మ్యాపింగ్ చేసి, కొత్త ఖనిజ నిల్వలను గుర్తించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని పెంచేలా గనుల రంగాన్ని తీర్చిదిద్దాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు.