xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
రాష్ట్రంలో మెరుగైన విద్యుత్ అందిస్తాం - భట్టిదిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ‘ఇండి’ కూటమి నిరసనఈసీ కార్యాలయం ముట్టడి యత్నం హాస్యాస్పదం: రామచందర్ రావుభారత్‌ వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంక్‌యుద్ధ నౌకల కోసం భారీ రక్షణ ఒప్పందంగ్రామీణ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలురాష్ట్రంలో మెరుగైన విద్యుత్ అందిస్తాం - భట్టిదిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ‘ఇండి’ కూటమి నిరసనఈసీ కార్యాలయం ముట్టడి యత్నం హాస్యాస్పదం: రామచందర్ రావుభారత్‌ వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంక్‌యుద్ధ నౌకల కోసం భారీ రక్షణ ఒప్పందంగ్రామీణ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలు
ఆంధ్రప్రదేశ్

పార్వతీపురం మన్యం జిల్లాకు 3,008 పక్కా ఇళ్లు

06-10-2026 14:26
పార్వతీపురం మన్యం జిల్లాకు 3,008 పక్కా ఇళ్లు
ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (PMAY-G), ఆవాస్ ప్లస్ 2.0 పథకం కింద పార్వతీపురం మన్యం జిల్లాకు 3,008 పక్కా ఇళ్లు మంజూరయ్యాయి.
xPress24, Paravathipuram, October 6, పార్వతీపురం మన్యం జిల్లా, అక్టోబర్ 6: ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (PMAY-G), ఆవాస్ ప్లస్ 2.0 పథకం కింద పార్వతీపురం మన్యం జిల్లాకు 3,008 పక్కా ఇళ్లు మంజూరయ్యాయి. జిల్లాలోని 15 మండలాల్లో అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఈ ఇళ్లను కేటాయించనున్నారు. జిల్లాలో సుమారు 27 వేల మంది అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోగా, ఆవాస్ ప్లస్–2024 సర్వే ఆధారంగా 3,008 ఇళ్లు మంజూరయ్యాయి. ఏజెన్సీ, గిరిజన ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తూ మండలాల వారీగా ఇళ్లను కేటాయించారు. గుమ్మలక్ష్మీపురం మండలానికి 688, కురుపాం 332, సీతంపేట 288, కొమరాడ 252, సాలూరు 231, జియ్యమ్మవలస 201, భామిని 187, వీరఘట్టం 168 ఇళ్లు కేటాయించారు. అలాగే మక్కువకు 141, పాలకొండకు 140, పాచిపెంటకు 115, పార్వతీపురానికి 105, సీతానగరానికి 66, బలిజిపేటకు 61, గరుగుబిల్లికి 33 ఇళ్లు కేటాయించారు. ఇప్పటికే నిర్వహించిన ఆవాస్ ప్లస్–2024 సర్వే డేటా ఆధారంగానే లబ్ధిదారుల ఎంపిక జరగనుండటంతో కొత్తగా కుటుంబాల సర్వే నిర్వహించాల్సిన అవసరం లేదని గృహనిర్మాణ శాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ నుంచి అధికారిక లబ్ధిదారుల జాబితాలు అందిన అనంతరం ఎంపీడీవోలు, క్షేత్రస్థాయి సిబ్బంది ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల అర్హతలను పరిశీలించనున్నారు. నిబంధనల మేరకు పరిశీలన పూర్తిచేసి అనంతరం ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. – సిహెచ్. శ్రీనివాసరావు

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.