xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
పార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా సచిన్ అర్చిత్ రహార్ బాధ్యతల స్వీకరణచినమేరంగిలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’శ్రీసిటీ టీఐఎల్ కంపెనీ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందితీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేయాలిఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలినదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషిపార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా సచిన్ అర్చిత్ రహార్ బాధ్యతల స్వీకరణచినమేరంగిలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’శ్రీసిటీ టీఐఎల్ కంపెనీ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందితీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేయాలిఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలినదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి
ఆంధ్రప్రదేశ్

పార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా సచిన్ అర్చిత్ రహార్ బాధ్యతల స్వీకరణ

03-10-2026 17:05
పార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా సచిన్ అర్చిత్ రహార్ బాధ్యతల స్వీకరణ
పార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా నియమితులైన ఐఏఎస్ అధికారి సచిన్ అర్చిత్ రహార్ శనివారం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
xPress24, Paravathipuram, October 3, పార్వతీపురం మన్యం జిల్లా, అక్టోబర్ 3: పార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా నియమితులైన ఐఏఎస్ అధికారి సచిన్ అర్చిత్ రహార్ శనివారం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధుల సహకారంతో సబ్‌డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను అర్హులైన ప్రజలందరికీ పారదర్శకంగా అందేలా చూడటం తన ప్రథమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల సమస్యల పరిష్కారం, రెవెన్యూ సేవల్లో పారదర్శకత, ప్రజల నుంచి అందే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. అంతకుముందు కార్యాలయానికి చేరుకున్న సబ్‌కలెక్టర్ సచిన్ అర్చిత్ రహార్‌కు రెవెన్యూ అధికారులు, కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం అధికారులతో పరిచయ కార్యక్రమం నిర్వహించిన సబ్‌కలెక్టర్.. సబ్‌డివిజన్ పరిధిలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.