xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
పార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా సచిన్ అర్చిత్ రహార్ బాధ్యతల స్వీకరణచినమేరంగిలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’శ్రీసిటీ టీఐఎల్ కంపెనీ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందితీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేయాలిఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలినదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషిపార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా సచిన్ అర్చిత్ రహార్ బాధ్యతల స్వీకరణచినమేరంగిలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’శ్రీసిటీ టీఐఎల్ కంపెనీ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందితీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేయాలిఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలినదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి
ఆంధ్రప్రదేశ్

పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం. ప్రభాకర్ రెడ్డి

03-10-2026 16:47
పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం. ప్రభాకర్ రెడ్డి
పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం. ప్రభాకర్ రెడ్డి అన్నారు. శనివారం గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్‌పేటలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఆయన పారిశుధ్య పనులను పరిశీలించారు.
xPress24, Paravathipuram, October 3, పార్వతీపురం మన్యం జిల్లా, అక్టోబర్ 3: పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం. ప్రభాకర్ రెడ్డి అన్నారు. శనివారం గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్‌పేటలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఆయన పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి, పారిశుధ్య నిర్వహణపై సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం స్థానిక వాణిజ్య, వ్యాపార దుకాణాలను తనిఖీ చేసి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలను వ్యాపారులకు వివరించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించి, పర్యావరణహితమైన గుడ్డ సంచులను ఉపయోగించేలా వినియోగదారులను ప్రోత్సహించాలని సూచించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి పంచాయతీ సిబ్బందికి అందించాలని తెలిపారు. దుకాణాల ముందు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నిబంధనలు పాటించకుండా అపరిశుభ్రతకు కారణమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.