ఆంధ్రప్రదేశ్
పోలూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
01-10-2026 16:35
పోలూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది. రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు.
xPress24, Nandyal, October 1,
పోలూరు, అక్టోబర్ 1:
పోలూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది. రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ పింఛన్లు అందుకున్న లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం కనిపించడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు నెలవారీ పింఛన్‌ను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచినట్లు తెలిపారు. పెంచిన పింఛన్‌తో పాటు గత మూడు నెలల బకాయిలను కలిపి మొదటి నెలలోనే ఒక్కో లబ్ధిదారుడికి రూ.7 వేల పింఛన్ అందించినట్లు పేర్కొన్నారు.
ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, ఒకటో తేదీ సెలవు రోజున వస్తే ముందుగానే లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తున్నామని మంత్రి తెలిపారు.