ఆంధ్రప్రదేశ్
పల్లె పండుగతో గ్రామాల రూపురేఖల్లో మార్పు
07-10-2026 14:09
పల్లె పండుగ కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.
xPress24, Kothapeta, October 7,
కొత్తపేట:
పల్లె పండుగ కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో బుధవారం రూ.1.53 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు.