xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
పార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా సచిన్ అర్చిత్ రహార్ బాధ్యతల స్వీకరణచినమేరంగిలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’శ్రీసిటీ టీఐఎల్ కంపెనీ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందితీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేయాలిఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలినదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషిపార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా సచిన్ అర్చిత్ రహార్ బాధ్యతల స్వీకరణచినమేరంగిలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’శ్రీసిటీ టీఐఎల్ కంపెనీ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందితీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేయాలిఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలినదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి
తెలంగాణ

పిల్లల ఆన్‌లైన్ భద్రతపై ప్రత్యేక ఫ్రేమ్‌వర్క్ తీసుకువస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

03-10-2026 14:12
పిల్లల ఆన్‌లైన్ భద్రతపై ప్రత్యేక ఫ్రేమ్‌వర్క్ తీసుకువస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌లో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA) ఆధ్వర్యంలో జరుగుతున్న సౌత్ జోన్ రీజినల్ కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. పిల్లల సైబర్ భద్రత, ఆన్‌లైన్ నేరాల కట్టడికి సమగ్ర ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
xPress24, Hyderabad, October 3, హైదరాబాద్‌ వేదికగా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నాల్సా) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దక్షిణ మండల ప్రాంతీయ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితో పేదలు, బలహీనులకు న్యాయం అందించేలా న్యాయ సేవా సంస్థలు పనిచేస్తున్నాయని కొనియాడారు. ఈ సదస్సులో 'పిల్లల సైబర్ భద్రత' అనే అత్యంత కీలకమైన అంశాన్ని ఎంచుకున్నందుకు జస్టిస్ విక్రమ్ నాథ్ గారికి, నాల్సాకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డిజిటల్ యుగంలో ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జీవితాలను సులభతరం చేసినప్పటికీ, అమాయక పిల్లలు ఆన్‌లైన్ వేధింపులు, సైబర్ నేరాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమన్వయంతోనే సైబర్ నేరాల కట్టడి తెలంగాణలో మహిళలు, పిల్లల రక్షణ ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భరోసా కేంద్రాలు, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లు, షీ-భరోసా సైబర్ ల్యాబ్‌లు, సైబర్ అంబాసిడర్ల వంటి విభిన్న వ్యవస్థలు సమన్వయంతో పనిచేసినప్పుడే పిల్లలకు పూర్తి భద్రత లభిస్తుందన్నారు. పాఠశాల విద్యాశాఖతో ఒప్పందం కుదుర్చుకుని ఉపాధ్యాయులు, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. బాధితులకు ఆర్థిక సహాయంతో పాటు అన్ని విధాలా ప్రభుత్వ మద్దతు ఉంటుందని చెప్పారు. సమగ్ర చైల్డ్ ఆన్‌లైన్ సేఫ్టీ ఫ్రేమ్‌వర్క్ తెలంగాణ హైకోర్టు, రాష్ట్ర న్యాయ సేవా సంస్థ (టీజీఎస్-ఎల్‌ఎస్‌ఏ)తో కలిసి చర్చించి పిల్లల ఆన్‌లైన్ భద్రత కోసం ఒక సమగ్ర 'చైల్డ్ ఆన్‌లైన్ సేఫ్టీ ఫ్రేమ్‌వర్క్'ను సిద్ధం చేయాలని సంబంధిత శాఖలను సీఎం ఆదేశించారు. సైబర్ నేరాల నివారణకు 1930, చైల్డ్ హెల్ప్‌లైన్ కోసం 1098 నంబర్లను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహపూర్వకంగా మసలుకుంటూ, ఇంటర్నెట్ వాడకంపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో జరిగే చర్చలు, సిఫారసులు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.