ఆంధ్రప్రదేశ్
ప్రజలు, పార్టీ నాయకుల సంక్షేమమే ధ్యేయంగా ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పరామర్శలు
29-09-2026 16:59

VBGRAMG నిధులతో చేపట్టిన పల్లె పండుగ–3.0 – 2026 కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం నుంచి అంతర్గత రహదారుల నిర్మాణ పనులకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ, ప్రజలతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారు పలువురిని పరామర్శించారు.

ఇటీవల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి స్వగృహానికి చేరుకున్న జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ రావూరి కృష్ణ గారిని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించి, ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అనంతరం కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ బొంతు వెంకటేశ్వరావు గారు శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో, వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఈ పరామర్శ కార్యక్రమాల్లో పట్టణ పార్టీ అధ్యక్షులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శాసనసభ్యులతో కలిసి పాల్గొన్నారు.