తెలంగాణ
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు.. ఏసీబీ కోర్టులో కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్
13-10-2026 10:28
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ ఛార్జ్‌షీట్ నుంచి తన పేరును తొలగించాలని కోరుతూ మాజీ మంత్రి కేటీఆర్ నాంపల్లి ఏసీబీ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు వచ్చే నవంబర్‌లో విచారణ జరిపే అవకాశముంది.
xPress24, Hyderabad, October 13,
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ నాంపల్లి ఏసీబీ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో తన పేరును తొలగించాలని, నిందితుల జాబితా నుంచి తనను తప్పించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన ఈ డిశ్చార్జ్ పిటిషన్‌పై నాంపల్లి ఏసీబీ కోర్టు వచ్చే నెలలో విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
పాజ్...
ఈ కేసులో ఏసీబీ అధికారులు ఇప్పటికే కేటీఆర్‌ను ఏ1 నిందితుడిగా ఛార్జ్‌షీట్‌లో పేర్కొనగా, ఆ ఛార్జ్‌షీట్‌ను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకున్న విషయం విదితమే. ఈ వ్యవహారంలో కేటీఆర్ ఇప్పటికే రెండుసార్లు స్వయంగా కోర్టు విచారణకు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో తాజాగా ఏసీబీ వేసిన ఛార్జ్‌షీట్‌లో తన ప్రమేయం లేదని, తన పేరును తొలగించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు త్వరలోనే విచారించి తుది నిర్ణయం తీసుకోనుంది.