xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
మచిలీపట్నంలో మై భారత్ యువ వాలంటీర్ల ఎంపికప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యతనంద్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణఅబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను కఠినంగా అమలు చేస్తాం: జిల్లా కలెక్టర్ డా. సిరిస్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తిరుపతి జిల్లా యంత్రాంగం సిద్ధంమచిలీపట్నంలో మై భారత్ యువ వాలంటీర్ల ఎంపికప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యతనంద్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణఅబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను కఠినంగా అమలు చేస్తాం: జిల్లా కలెక్టర్ డా. సిరిస్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తిరుపతి జిల్లా యంత్రాంగం సిద్ధం
తెలంగాణ

బీఆర్ఎస్ పాలనలో అప్పులు, అవినీతి పెరిగాయి: ఎంపీ చామల

15-10-2026 09:52
బీఆర్ఎస్ పాలనలో అప్పులు, అవినీతి పెరిగాయి: ఎంపీ చామల
బీఆర్ఎస్ తొమ్మిదేన్నర ఏళ్ల పాలనా వ్యవహారాలను సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో వివరించారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారని ఆరోపించారు.
xPress24, Hyderabad, October 14, బీఆర్ఎస్ తొమ్మిదేన్నర ఏళ్ల పాలనా వ్యవహారాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో స్పష్టంగా వివరించారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇవాళ మీడియాతో ఎంపీ మాట్లాడుతూ... 9 జిల్లాల్లో బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన భూములు, హోటళ్ల వివరాలను సీఎం సభ ముందర ఉంచారని పేర్కొన్నారు. తమ నాయకుల గొంతును టాంపరింగ్ చేస్తూ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ప్రచారం చేస్తోందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంపై 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల భారం పడిందని ఆరోపించారు. భూములపై విచారణకు సిద్ధం తన పేరు మీద ఎలాంటి అసైన్డ్ భూములు, 22ఏ జాబితాలో ఉన్న భూములు లేదా అక్రమ ఆస్తులు ఉన్నట్లు నిరూపిస్తే అధికారులను పిలిచి రాసిచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఎంపీ అన్నారు. తెలంగాణ సమాజానికి తనను విలన్‌గా చూపించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. అమెరికాలో 6 ఏళ్లు ఉండి హోటల్ నిర్మించుకున్నామని చెప్పే బీఆర్ఎస్ నేతల కుటుంబం పాలనలో రాష్ట్రం ఎందుకు అప్పులపాలైందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రచారాలు స్వస్తి పలకాలి రాజకీయ ప్రయోజనాల కోసం డ్రామాలు ఆడటం నిలిపివేయాలని బీఆర్ఎస్ నేతలకు చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు. ఏనుగు ఎక్కి ప్రగతి భవన్‌కు వెళ్తానని చెప్పిన నాయకులు ప్రస్తుతం ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.