ఆంధ్రప్రదేశ్
బుచ్చి అప్పారావు జీవితం ఆదర్శనీయం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
13-10-2026 16:08
దివంగత గొర్రెపాటి బుచ్చి అప్పారావు జీవితం అందరికీ ఆదర్శనీయమని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
xPress24, Vizianagaram, October 13,
విజయనగరం జిల్లా, అక్టోబర్ 13:
దివంగత గొర్రెపాటి బుచ్చి అప్పారావు జీవితం అందరికీ ఆదర్శనీయమని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
మంగళవారం విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో తాటిపూడి రిజర్వాయర్ నిర్మాణ సాధకుడు, మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి విశాఖ జిల్లా బోర్డు మాజీ అధ్యక్షుడు గొర్రెపాటి బుచ్చి అప్పారావు జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, పలువురు రైతులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ, తాటిపూడి రిజర్వాయర్ నిర్మాణాన్ని సంకల్పబలంతో పూర్తి చేయించిన మహనీయుడు బుచ్చి అప్పారావు అని కొనియాడారు. ఆయన కృషి ఫలితంగా నేడు వేలాది ఎకరాలకు సాగునీరు అందుతోందని, ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారిందని గుర్తుచేశారు. ప్రజల సంక్షేమం, రైతుల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.