ఆంధ్రప్రదేశ్
బీజేపీ సంస్థాగత బలోపేతమే లక్ష్యం
01-10-2026 16:41

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తన బలాన్ని నిరూపించుకునేలా క్షేత్రస్థాయి శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపడంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కృషి చేస్తామని బీజేపీ రాష్ట్ర నూతన ఇన్‌చార్జ్, మధ్యప్రదేశ్‌కు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అరవింద్ సింగ్ భదౌరియా తెలిపారు.
xPress24, Vijayawada, October 1,
విజయవాడ: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తన బలాన్ని నిరూపించుకునేలా క్షేత్రస్థాయి శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపడంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కృషి చేస్తామని బీజేపీ రాష్ట్ర నూతన ఇన్‌చార్జ్ అరవింద్ సింగ్ భదౌరియా తెలిపారు.
విజయవాడలో జరుగుతున్న బీజేపీ పదాధికారుల సమావేశానికి హాజరయ్యేందుకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న అరవింద్ సింగ్ భదౌరియాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా అరవింద్ సింగ్ భదౌరియా మాట్లాడుతూ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారిస్తామన్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. క్షేత్రస్థాయిలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.