జాతీయం
బీజేపీతో పొత్తు ఉండదన్న కేటీఆర్
01-10-2026 17:32

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాతో పొత్తు ఉండబోదని BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు కే తారక రామారావు స్పష్టం చేశారు. సైద్ధాంతికంగా వ్యతిరేకమైన భాజపాతో గతంలోనూ పొత్తు పెట్టుకోలేదని, భవిష్యత్తులోనూ ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు. కొచ్చిన్‌లో జరిగిన ఒక ప్రైవేట్ మీడియా సదస్సులో కేటీర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ డీలిమిటేషన్ విధానంతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన 420కి పైగా హామీల్లో ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేకపోయిందని, రేవంత్‌రెడ్డి దిల్లీకి మాత్రమే విధేయుడిగా ఉన్నారని విమర్శించారు. ప్రజల్లో కాంగ్రెస్‌పై తీవ్ర అసంతృప్తి ఉందని, తెలంగాణలో మళ్లీ కేసీఆర్ నేతృత్వంలో BRS ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
xPress24, HYDERABAD, October 1,