తెలంగాణ
బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక: కిషన్రెడ్డి
16-10-2026 16:22

హైదరాబాద్, బంజారాహిల్స్ లోని సాగర్ సొసైటీలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక మహిళలతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన, బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి, మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక అని కొనియాడారు. పూలను పూజించే ఈ అద్భుత వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, తన తరఫున ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. గౌరమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ సుఖశాంతులు చేకూరాలని, ప్రధాని మోదీకి ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.
xPress24, HYDERABAD, October 16,