తెలంగాణ
బాపూఘాట్‌లో గాంధీ జయంతి వేడుకలు
02-10-2026 17:06

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లంగర్‌హౌస్ సమీపంలోని బాపూఘాట్ వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బాపూఘాట్ వద్ద గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడ ఏర్పాటు చేసిన చిత్రప్రదర్శనను తిలకించడంతో పాటు, బాపూఘాట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ మ్యూజియాన్ని గవర్నర్, ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం ప్రార్థనా మందిరంలో నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్ తదితరులు పాల్గొని బాపూజీ సేవలను స్మరించుకున్నారు.
xPress24, HYDERABAD, October 2,