ఆంధ్రప్రదేశ్
బాపట్లలో రూ.10.20 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం
05-10-2026 13:09
బాపట్ల మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల సమగ్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు తెలిపారు
xPress24, Bapatla, October 5,
బాపట్ల, అక్టోబర్ 5:
బాపట్ల మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల సమగ్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు తెలిపారు. బాపట్ల మున్సిపాలిటీలోని 7, 8, 9వ వార్డుల్లో సుమారు రూ.10.20 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు సోమవారం ఎమ్మెల్యే భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. ఇందులో భాగంగా బాపట్ల పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన రహదారులు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. బాపట్ల మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.