ఆంధ్రప్రదేశ్
బుర్రిపాలెంలో రేపు పర్యటించనున్న ముఖ్యమంత్రి
03-10-2026 09:34

గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నిన్న బుర్రిపాలెంలో పర్యటించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా త్రీడీ సాంకేతికతతో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.
xPress24, Burripalem, October 3,