తెలంగాణ
బెల్లంపల్లిలో ఈ నెల 30న కిసాన్ మేళా
28-09-2026 16:48

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 30వ తేదీన కిసాన్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటన లో తెలిపారు. రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికత, నూతన సాగు పద్ధతులు, ప్రభుత్వ పథకాలు, రైతు సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. వ్యవసాయ నిపుణులు, అధికారులు రైతులకు సూచనలు, సలహాలు అందిస్తారని తెలిపారు.
xPress24, HYDERABAD, September 28,