ఆంధ్రప్రదేశ్
బాపట్లలో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు
30-09-2026 15:04

బాపట్ల పట్టణ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. పట్టణంలోని 1, 2, 3 వార్డుల పరిధిలో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు జమ్ములపాలెం రోడ్డు (హోసన్న మందిరం పక్కన) బాపట్ల శాసనసభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు శంకుస్థాపన చేశారు.
బాపట్ల పట్టణ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. పట్టణంలోని 1, 2, 3 వార్డుల పరిధిలో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు జమ్ములపాలెం రోడ్డు (హోసన్న మందిరం పక్కన) బాపట్ల శాసనసభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు మాట్లాడుతూ... పట్టణ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని, అందులో భాగంగానే ఈ రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. నాణ్యతా ప్రమాణాలకు ఎక్కడా రాజీ పడకుండా, అధికారుల పర్యవేక్షణలో నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులు మరియు కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కావూరి శ్రీనివాసరెడ్డి,బాపట్ల పట్టణ అధ్యక్షుడు మందపాటి ఆంద్రెయ,మాజీ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు,మాజీ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వడ్లమూడి వెంకటేశ్వర్లు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాల నారాయణ, 1వ వార్డు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ సోముల ప్రసాద్,2వ వార్డు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అంకాల శ్రీనివాసరావు,3వ వార్డు ప్రెసిడెంట్ యలవుల వెంకటేశ్వర్లు మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.