తెలంగాణ
భూ సమస్యలకు పరిష్కారం
29-09-2026 09:39

తెలంగాణలో భూ సర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్, హౌసింగ్ అంశాలపై వనపర్తిలో మంత్రి సోమవారం సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ, భూ భారతి చట్టం హామీ మేరకు ప్రతి భూమికి ప్రత్యేక గుర్తింపు, మ్యాప్, ల్యాండ్ పార్శిల్ మ్యాప్ నంబర్ అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వెల్లడించారు.భూ భారతి కింద తొలి దశలో 70 రెవెన్యూ గ్రామాలను సర్వేకు ఎంపిక చేశామని వాటిలో దశలవారీగా సర్వే చేయనున్నట్లు వెల్లడించారు.
xPress24, Vanaparti, September 29,