xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
రాష్ట్రంలో మెరుగైన విద్యుత్ అందిస్తాం - భట్టిదిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ‘ఇండి’ కూటమి నిరసనఈసీ కార్యాలయం ముట్టడి యత్నం హాస్యాస్పదం: రామచందర్ రావుభారత్‌ వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంక్‌యుద్ధ నౌకల కోసం భారీ రక్షణ ఒప్పందంగ్రామీణ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలురాష్ట్రంలో మెరుగైన విద్యుత్ అందిస్తాం - భట్టిదిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ‘ఇండి’ కూటమి నిరసనఈసీ కార్యాలయం ముట్టడి యత్నం హాస్యాస్పదం: రామచందర్ రావుభారత్‌ వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంక్‌యుద్ధ నౌకల కోసం భారీ రక్షణ ఒప్పందంగ్రామీణ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలు
జాతీయం

భారత్, స్విట్జర్లాండ్ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు

06-10-2026 09:33
భారత్, స్విట్జర్లాండ్ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు
భారత్, స్విట్జర్లాండ్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై పార్మెలిన్ భారత్‌లో పర్యటిస్తున్నారు. వాణిజ్యం, సాంకేతికత, రక్షణ రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీతో పార్మెలిన్ కీలక చర్చలు జరిపారు.
xPress24, Delhi, October 5, భారతదేశంలో మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై పార్మెలిన్ విచ్చేశారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ప్రజాస్వామ్య విలువలు, పరస్పర నమ్మకమే ఇరు దేశాల బంధానికి బలమైన పునాదని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన ఆయన, ద్వైపాక్షిక సంబంధాల ప్రగతిపై సమీక్ష జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, కృత్రిమ మేధ, రక్షణ ఉత్పత్తి, అణు శక్తి, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో పలు ఒప్పందాలు కుదిరాయి. భారత్-ఈఎఫ్‌టీఏ దేశాల మధ్య కుదిరిన టీఈపీఏ ఒప్పందం అమల్లోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆర్థిక సహకారంలో వస్తున్న సానుకూలతను ఇరు నేతలు అభినందించారు. రానున్న పదిహేనేళ్లలో నూరు బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించి, పది లక్షల ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ అంశాలపై చర్చ ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని ప్రధాని మోదీ సంయుక్త మీడియా సమావేశంలో తెలిపారు. అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ పర్యటనలో భాగంగా రవాణా, మౌలిక వసతులు, వలసలు, యువ నిపుణులు, ఆరోగ్యం, క్లీన్ ఎనర్జీ, అంతరిక్ష రంగాల్లో నూతన సంయుక్త పరిశోధనలపై కీలక ఒప్పందాలు కుదిరాయి. వ్యవసాయం, ఫార్మా, టెక్స్‌టైల్స్, ఇంజనీరింగ్ రంగాల ఎగుమతులను మరింత పెంచేలా నిర్ణయాలు తీసుకున్నారు. బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, బ్యాంకింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో స్విట్జర్లాండ్ పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు. మైగ్రేషన్ అండ్ మొబిలిటీ ఒప్పందం ద్వారా భారతీయ విద్యార్థులు, యువ నిపుణులకు స్విట్జర్లాండ్‌లో మరిన్ని నూతన అవకాశాలు లభించనున్నాయి. భవిష్యత్ కార్యాచరణ శతాబ్దాల నాటి చారిత్రాత్మక బంధం కలిగిన భారత్, స్విట్జర్లాండ్ దేశాలు నూతన సాంకేతికత, ఆవిష్కరణలే ప్రధాన స్థంభాలుగా ముందుకు సాగుతున్నాయి. ఈ ఉన్నత స్థాయి పర్యటన ఇరు దేశాల ప్రజల మధ్య మైత్రిని మరింత పటిష్టం చేస్తూ, ప్రపంచ శాంతికి, పరస్పర సమృద్ధికి బలమైన బాటలు వేస్తోంది.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.